పాల్వంచ పరిసరాల్లో పెద్దపులి సంచారం..

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచరిస్తుడటం కలకలం రేపుతున్నది. ఆయిల్‌ఫాం సమీపంలో ఓ జంతువు పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ అధికారులకు తెలిపారు. దీంతో వారు ఆ ప్రాంతో పర్యటించి పులి సంచరించిందని, ఈ పాదముద్రలు పులివే అని నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ మండలంలోని ప్రభాత్ నగర్ సమీప ప్రాంతాల్లో బుధవారం పులి పాదముద్రలు కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ అధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటించి పాదముద్రల నమూనాలను సేకరించారు. ఈ ప్రాంతంలో పులి సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, అటవీప్రాంతాల్లో ఒంటరిగా సంచరించకూడదని కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ రేంజర్ శ్రీనివాసరావు అన్నారు.