పేదల షాపుల కోసం భూమిని కేటాయించండి

విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్ వినతి

చెన్నూర్‌: ప‌ట్ట‌ణంలోని పేదల షాపుల కోసం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోని భూమిని కేటాయించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌ బా ల్క సుమన్‌ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో విద్యుత్‌శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. చెన్నూర్‌ పట్టణ అభివృద్ధిలో భాగంగా జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు రూ.13 కోట్ల టీయూఐఎఫ్‌డీసీ నిధులతో నిర్మిస్తున్న ప్రధాన రహదారి వెడ ల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. నిర్మాణంలో భాగంగా సుమారు 60 మంది తమ షాపులను కోల్పోతున్నారని మంత్రి దృషి కి తీసుకెళ్లారు. జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలోని ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూమిలో 60 దుకాణాలకు సరిపడా భూమిని మున్సిపాలిటీ కేటాయించాలని కోరారు. తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మంత్రికి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.