పేషావ‌ర్‌లో పేలుడు.. 7 మంది మృతి, 70 మందికి గాయాలు

పెషావ‌ర్‌‌: పాకిస్థాన్‌లోని పేషావ‌ర్‌లో బాంబు పేలుడు జ‌రిగింది. ఈ పేలుడులో 7 గురు మృతిచెందారు. ఆ ఘ‌ట‌న‌లో మ‌రో 70 మందికి తీవ్ర‌ గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న‌గ‌రంలోని ఓ శిక్ష‌ణ స్కూల్‌లో జ‌రిగినట్లు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు పేషావ‌ర్ పోలీసు ఆఫీస‌ర్ మ‌న్సూర్ అమ‌న్ తెలిపారు. ఐఈడీతో పేలుడుకు పాల్ప‌డి ఉంటార‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. ఆ ప్రాంతానంతా పోలీసులు ఆదీనంలోకి తీసుకొని క్లూస్ సేక‌రిస్తున్నారు.

స్కూల్‌లో ఖురాన్ పాఠాలు బోధిస్తున్న స‌మ‌యంలో పేలుడు జ‌రిగిన‌ట్లు పోలీసు అధికారి వెల్ల‌డించారు. గుర్తుతెలియ‌న వ్య‌క్తి ఒక బ్యాగ్‌తో ఆ శిక్ష‌ణాల‌యంలోకి వెళ్లిన‌ట్లు అధికారులు గుర్తించిన‌ట్లు తెలిసింది. కాగా గాయ‌ప‌డ్డ‌వారిలో చిన్నారుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.