తప్పనిసరిగా మాస్కు ధరించాలి : సిపి వి.సత్యనారాయణ

రామ‌గుండం: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారికి వేయి రూపాయల జరిమానా విధించబడుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఐపీఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల ప్రజలందరూ తప్పనిసరిగా నిత్యం మాస్కులు ధరించి,భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు నుండి ఎవరైనా మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే G.O no.82 ఉత్తర్వుల ప్రకారం 51(బి) సెక్షన్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం పోలీసు వారు E-challan ద్వారా వారికి 1000/- రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. కావునా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.