ఫుట్‌బాల్ హీరో మారడోనా ఇకలేరు..

అర్జెంటీనా: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ డియెగో మారడోనా బుధవారం గుండెపోటుతో టైగ్రేలోని తన ఇంట్లో కన్నుమూశారు. ఈ ఫుట్‌బాల్ ఐకాన్ కన్నుమూసినట్లు మారడోనా న్యాయవాది ప్రకటించారు. అయితే 1986 ప్రపంచ కప్ అర్జెంటీనా జట్టుకు టైటిల్ అందించిన గొప్ప ఆటగాడు డియెగో. కొకైన్ వాడకం, ఊబకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయన మెదడుకు శస్త్రచికిత్స జరిగింది. రెండు వారాల క్రితమే ఆయన ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. బుధవారం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. మారడోనా మృతితో అర్జెంటీనా ప్రభుత్వం మూడురోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.
డిగో 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన మారడోనా ఫుట్‌బాల్‌లో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. తన ఆటతో 20ఏళ్లకు పైగా అభిమానులను అలరించారు. పోట్లగిత్తను తలపించే దూకుడుతోనూ, ప్రత్యర్థులను చాకచాక్యంగా బోల్తా కొట్టించే నైపుణ్యంతో మారడోనా ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్యుడిగా మారారు. సాకర్‌ను ప్రేమించే అర్జెంటీనాలో ఆయన్ను ‘గోల్డెన్ బారు’గా పిలుస్తారు. పదో నెంబర్ జెర్సీ అంటే గుర్తొచ్చేది మారడోనానే. ఒక కాలి నుండి ఇంకో కాలికి బాల్‌ను అలవోకగా మార్చుకుంటూ సాగే ఆయన్ను అంచనా వేయడంలో ప్రత్యర్థికి చుక్కలు కనిపించేవి. ఎడమ పాదం అయని బలమైన ఆయుధం. పొట్ట పెరగడంతో క్రమంగా అతడి వేగం తగ్గింది. 1991లో డోపింగ్ కుంభకోణం అతడికి పెద్ద దెబ్బ. కొకైన్కు అలవాటు పడ్డట్లు అప్పట్లో ఆయన అంగీకరించాడు. 1997లో రిటైరయ్యేంత వరకూ ఆ కుంభకోణం వెంటాడుతూనే ఉంది. అతిగా మద్యం తాగడం, తినడంతో 2007లో మరోసారి ఆస్పత్రిపాలయ్యారు. 2008లో అర్జెంటీనా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. కానీ 2010 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో పరాజయంతో అతడి పదవి పోయింది. అర్జెంటీనా తరపున అతడు 91మ్యాచుల్లో 34 గోల్స్ కొట్టాడు. ఫిఫా ..2001లో పీలేతో పాటు అతణ్ని ఫుట్‌బాల్ చరిత్రలో మేటి ఆటగాడిగా ప్రకటించింది. మారడోనా మణికట్టుపై చేగువేరా, ఎడమ కాలి మీద క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో చిత్రాన్ని సైతం టాటూగా వేయించుకున్నాడు.
- పుట్టిన తేదీ: అక్టోబర్ 30, 1960
- పుట్టిన స్థలం: బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
- 1976 అర్జెంటీనా జూనియర్ జట్టులో స్థానం, అరంగేట్రం
- 1977 అర్జెంటీనా సీనియర్ జట్టులో చోటు
- 1986 మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనాకు 2–1తో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా ► సాధించిన రెండు గోల్స్ చరిత్రలో నిలిచిపోయాయి.
- 1994 అమెరికాలో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పంపించారు. 15 నెలలపాటు సస్పెన్షన్.
- 1997 రివర్ ప్లేట్ క్లబ్‌తో కెరీర్లో చివరి మ్యాచ్ ఆడాడు.
- 2000 కొకైన్ అడిక్షన్ నుంచి విముక్తికి క్యూబాలో రిహాబిలిటేషన్.
- 2005 సొంత టీవీ కార్యక్రమం నిర్వహించాడు.
2008–2010 రెండేళ్లపాటు అర్జెంటీనా జాతీయ సీనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2010 ప్రపంచకప్‌లో మారడోనా కోచ్‌గా ఉన్న అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది.
ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా…
- ఆడిన మ్యాచ్‌లు: 585
- చేసిన గోల్స్: 311
- గెలిచిన టైటిల్స్ 9
- అర్జెంటీనా తరఫున…
- ఆడిన మ్యాచ్‌లు 91
- చేసిన గోల్స్ 34
ఆడిన ప్రపంచకప్‌లు
- 1982: రెండో రౌండ్లో నిష్క్రమణ
- 1986: విజేత
- 1990: రన్నరప్
- 1994: ప్రిక్వార్టర్ ఫైనల్
నవంబర్ 25, 2020: గుండెపోటుతో బ్యూనస్ ఎయిర్స్లో కన్నుమూత