బల్దియాపై మళ్లీ గులాబీ రెపరెపలు : విప్ అరెకపూడి గాంధీ

హైదరాబాద్: టిఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో తమ పట్ల ఎనలేని అభిమానం, విశ్వాసం నెలకొన్నదని తద్వారా మరోమారు ప్రజల మద్దతుతో బల్దియాపై గులాబీ జెండాను అఖండ మెజార్టీతో ఎగిరేయబోతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని డివిజన్‌లలో మౌలిక వసతులను కల్పించాం అని విప్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, లక్ష్మీనగర్, మయూరినగర్, ప్రశాంత్‌నగర్‌లలో రూ. 6.68 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ మంగళవారం శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో విపత్కర సంక్షోభం ఎదురైనప్పటికీ సంక్షేమాన్ని ఏమాత్రం ఆపకుండా ప్రజల దరికి చేర్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.డివిజన్‌లలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ రూపాదేవి, ఏఈ రమేశ్, వర్క్ ఇన్‌స్పెపెక్టర్ విశ్వనాథ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, పార్టీ నేతలు పురుషోత్తం, గంగాధర్, కిరణ్, గోపాల్‌రావు, మోహన్, అన్వర్ షరీఫ్, ప్రతాప్‌రెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.
(ప్రశాంత్‌నగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్)