బిజెపికి రావుల శ్రీధర్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి, ముఖ్య నాయకుడు రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపిన అనంతరం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. తనతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ డివిజన్ల నేతలు, కార్యకర్తలు టిఆర్ ఎస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. బీజేపీలో తాను 11 సంవత్సరాలుగా ఉన్నానని.. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ గురించి మాట్లాడిన ఆయన సంచలన ఆరోపణలే చేశారు.
మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం పూర్తి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోందని ఆ పార్టీతో న్యాయం జరగదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. టీఆర్ఎస్‌లో చేరి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ఐటీ రంగం పురోగమిస్తుందన్నారు.