బొగ్గుగ‌ని కార్మికుల‌కు వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌

పెద్ద‌ప‌ల్లి (CLiC2NEWS): గోదావ‌రిఖ‌నిలోని సింగ‌రేణి ఏరియా ఆస్ప‌త్రిలో రామ‌గుండం-1 ఏరియా కోల్ మైన‌ర్స్‌కి… సింగ‌రేణి కొల‌రీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మ‌న్‌, ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ ఆదేశాల మేర‌కు వ్యాక్సిన్ డ్రైవ్ చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో రామ‌గుండం ప్రాంతంలోని దాదాపు 100 మందికి పైగా బొగ్గుగ‌ని కార్మికుల‌కు ఆదివారం వ్యాక్సినేష‌న్ నిర్వ‌హించారు. 45 ఏళ్లు పైబ‌డిన 100 మంది ఉద్యోగుల‌కు కొవాగ్జిన్ మొద‌టి డోస్ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్జీ -1 జనరల్ మేనేజర్ లాల్వాలా నారాయణ, అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బి. వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.