బ్యాంకులకు వరుసగా సెలవులు!

ముంబ‌యి: తెలంగాణ‌లో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు వ‌రుస సెల‌వులు ఉన్న‌ట్లు బ్యాంకు ఉన్న‌తాధికారులు తెలిపారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి త‌మ అవ‌స‌రాల‌కు ఇబ్బంది రాకుండా చూసుకోవాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు. ఆదివారాలు, పండుగ ప‌ర్వ‌దినాలు కాకుండా రెండో, నాలుగో శ‌నివారాలు బ్యాంకుల‌కు సెల‌వులు. ఎందుకంటే వరుసగా సెలవులు, బంద్‌లు, పండుగలు.. ఇలా రేపటి నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు చాలా రోజులు అసలు బ్యాంకులు తెరుచుకోని పరిస్థితి. ఇక, బ్యాంకుల సెలవులు.. పనిదినాలు పరిశీలిస్తే..

  • మార్చి 27 : నాలుగో శనివారం
  • మార్చి 28 : ఆదివారం
  • మార్చి 29 : హోలీ
  • మార్చి 31 : ఆర్థిక సంవత్సరం చివరి రోజు
  • ఏప్రిల్‌ 1 : వార్షిక ఖాతాల మూసివేత
  • ఏప్రిల్‌ 2 : గుడ్‌ ఫ్రైడే
  • ఏప్రిల్‌ 4 : ఆదివారం
  • ఏప్రిల్‌ 5 : బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి
  • ఏప్రిల్‌ 10 : రెండో శనివారం
  • ఏప్రిల్‌ 11 : ఆదివారం
  • ఏప్రిల్‌ 13 : ఉగాది
  • ఏప్రిల్‌ 14 : అంబేద్కర్‌ జయంతి
  • ఏప్రిల్‌ 18 : ఆదివారం
  • ఏప్రిల్‌ 21 : శ్రీరామ నవమి
  • ఏప్రిల్‌ 24 : నాలుగో శనివారం
  • ఏప్రిల్‌ 25 : ఆదివారం

రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 4 మధ్య కాలంలో కేవలం రెండు రోజులు (మార్చి 30, ఏప్రిల్‌ 3 తేదీల్లో) మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులు పనిచేయవు. అంతేకాకుండా ఏప్రిల్‌లో ఏకంగా 12 రోజులు మూతపడతాయి. ఈ సెలవు దినాల్లో నెట్‌బ్యాంకింగ్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండకపోయినప్పటికీ ఇతర అవసరాల కోసం ఖాతాదారులు ముందే మేల్కోవడం మంచిది.

Leave A Reply

Your email address will not be published.