భారత్‌ కరోనా అప్‌డేట్.. 91 లక్షల మార్క్‌ దాటిన కేసులు

న్యూఢిల్లీ:  దేశంలో గ‌త కొన్ని రోజులుగా కొత్త‌గా న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల సంఖ్య 40 వేల పైనే ఉంటోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ్యాప్తంగా గత 24 గంటల్లో 44,059 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంల 511 మంది కరోనాబారినపడి మృతిచెందా 41,024 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో పాజిటివ్ కేసులు సంఖ్య 91 లక్షల మార్క్‌ను కూడా దాటేసి 91,39,866కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 1,33,738 మంది కరోనాతో మృతిచెందగా 85,62,642 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,486 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. కాగా, 40 వేలకు దిగవగా పడిపోయిన రోజువారీ కేసుల సంఖ్య, చలి తీవ్రత పెరుగుతుండడంతో మళ్లీ విజృంభిస్తూ వస్తోంది.

ఢిల్లీలో ఒక్క‌రోజే 121 మంది మృతి
దేశ రాజ‌ధానిలోక‌రోనా విజృంభిస్తూనే ఉంది. ఢిల్లీలో మ‌రోసారి 100కి పైగా మ‌ర‌ణాలు సంంభవించాయి. ఆదివారం కొత్త‌గా 6,746 వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 5,29,863కు పెరిగింది. ఇక 24 గంట‌ల్లో 121 మంది వైర‌స్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 8,391కి పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.