మండపేట ఎంపీడీవోగా ఐదం రాజు నియామకం..

మండపేట: మండపేట మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా ఈవోపీఆర్డీ ఐదం రాజు నియమితులయ్యారు. ఆయన గత కొద్ది కాలంగా మండలం లో బాధ్యత నిర్వహిస్తున్నారు. మండలంలో అన్ని గ్రామ పంచాయతీలతో నిత్యం సత్సంబంధాలు పెట్టుకుని పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కార్యక్రమాలు, పంచాయతీల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పరిపాలనపై అపారమైన అనుభవం ఉన్న రాజు ఎంపీడీవోగా అడిషనల్ చార్జీతో నియమించారు. కాగా రాజు నియామకం పట్ల మండలం లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో సమస్యలపై అవగాహన ఉన్న ఐదం రాజు ఎంపీడీవోగా రావడంతో మండలంలో అభివృద్ధి మరింత వేగం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.