మండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర మండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్‌గా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుండి భూపాల్ రెడ్డి ప్రొటెం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
శాసన మండలికి చైర్మన్‌ను ఎన్నుకునే వరకు భూపాల్ రెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ఉన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తో పాటు మరో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం నేటితో ముగిసింది.