మీ ప్రేమాభిమానాలు కలకాలం కొనసాగాలి: కెసిఆర్

హైదరాబాద్: తన జన్మదినం సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్, ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎంపీలకు ఎమ్మెల్యేలకు, నాయకులు, ప్రముఖులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ, అభిమానాలు కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. భర్త్‌డే విషెస్ చెప్పిన వారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళిసై, ఢిల్లీ సిఎం కేజ్రివాల్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్, కర్ణాటక సిఎం యెడ్యూరప్ప, త్రిపుర సిఎం విప్లవ్‌దేవ్ కుమార్ తదితరులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూర్‌స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బర్త్‌డే విషెస్ తెలిపారు. అలాగే కెసిఆర్ జన్మదినం పురస్కరించుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు.