రథోత్సవంలో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

ఆలూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కర్నూల్‌ జిల్లా ఆలూరు మండలం అరికెర రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్థానికులు రథాన్ని లాగుతుండగా రథానికి విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో మరో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. మృతులను శివ (25), లక్ష్మన్న(28)గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.