రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి ఇవాళ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసానికి తోడు సోమవారం శివునికి అత్యంత ప్రీతి కరమైన రోజు కావడంతో వేకువజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో రాజన్న ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉదయం స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు.