`రాజన్న సిరిసిల్ల`లో చిరుతపులి కలకలం

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో కనిపించిన చిరుతపులి.. మళ్లీ ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున వేములవాడ అర్బన్ మండలంలోని మారుపాక శివారులో సంచరించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. దీంతో విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మారుపాక ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న వార్త తెలిసిన స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం మల్కాపూర్‌లోని ఓ వ్యవసాయ బావిలో చిరుతపులి పడిపోయిన విషయం తెలిసిందే. అటవీ అధికారులు వచ్చేలోపే ఆ చిరుత అక్కడి నుంచి తప్పించుకున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇదే జిల్లాలో వేముల వాడ అర్బన్ మండలంలో చిరుత సంచిరించిందన్న దానిపై అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.