రాజ్యసభ వాయిదా.. విపక్షాల వాకౌట్

న్యూఢిల్లీ: రాజ్యసభ నుండి మంగళవారం ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కొత్త సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు రాజ్యసభలో డిమాండ్ చేశాయి. ఆ డిమాండ్‌ను చైర్మన్ వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు. కానీ సభలో రేపటి నుంచి రైతు సమస్యలపై చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ తన ప్రసంగంలో రైతు ఆందోళనల గురించి మాట్లాడారని, నిజానికి ఇవాళే సభలో చర్చ చేపట్టాలని ఉందని, కానీ తొలుత ఆ సబ్జెక్ట్‌పై లోక్‌సభలో చర్చ మొదలవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ప్రసంగంపై రేపటి నుంచి చర్చ ఉంటుందన్నారు. దాంతో సభలో గందరగోళం నెలకొనడంతో ఉదయం10.30 వరకు వాయిదా వేశారు.