రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. `నాలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కొవిడ్ ప‌రీక్ష చేయించుకోగా.. పాటిజివ్ గా తేలింది. న‌న్ను ఇటీవ‌ల సన్నితంగా మెలిగిన‌ వారు జాగ్ర‌త‌లు తీసుకోండి` అని ఆయ‌న ట్వీట్ చేశారు.
ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన అయిదు రాష్ట్రాల్లో ఆయ‌న ప్ర‌చారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్‌లో జ‌ర‌గాల్సిన చివ‌రి మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కూడా ఆయ‌న చెప్పిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.