వరద ముంపు ప్రాంతాల్లో సిఎం జగన్ ఏరియల్ సర్వే
రాజమండ్రి: ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. గోదావరి జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. సహాయక చర్యలు, ముంపునకు గురైన ప్రాంతాల పరిస్థితి గురించి అధికారులను ఆరా తీశారు. ముఖ్యమంత్రి జగన్ వెంట మంత్రులు సుచరిత, పేర్ని నాని ఉన్నారు. దీనికి ముందు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ఉభయగోదావరి జిల్లాల ముఖ్య నేతలు సీఎంను కలిశారు. అక్కడి పరిస్థితిని సీఎంకు వారు వివరించారు. కాగా, ఏరియల్ సర్వేకు వచ్చే ముందు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి వరద పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు
వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని’ ఆయన అన్నారు.