షేక్.బహర్ అలీ: మీ ఆరోగ్యము మీ చేతుల్లో

ప్రతి మనిషి ఉదయం నుండి సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు తనకు మరియు కుటుంబ సభ్యులకు తినటానికి కావలసిన ఆహారం కొరకు ఏదో ఒక ఉద్యోగం చేయక తప్పదు.ఈ జీవన పోరాటంలో హడావుడిగా ఉండటం,తనకు ఆరోగ్యం బాగోగులు కూడా సరైన సమయంలో చూసుకోపోవటం, సరైన సమయానికి తిని తినకపోవటం, సరైన నిద్ర లేకపోవటం, ఇలాంటి వాటితో ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది. దీనితో రకరకాల జబ్బులు రావటం, వచ్చిన జబ్బుకు ఇంత కాలం సంపాదించిన డబ్బులు ఆ జబ్బులకు పెట్టటం జరుగుతుంది. కావున ఇలాంటి వి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు నేను ప్రతి రోజు మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు, మీ ఆరోగ్యం– మీ చేతుల్లో ఉంటుంది. ఇది ముమ్మాటికీ నిజం, మరి ఆ సూత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అన్ని కాలలలో ఆరోగ్యం ఒకేలా ఉండదు. అతి చలి, అతి వేడి, వర్షాలు ఆయా రుతువులలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మన ఆహారవిహారాలలో మార్పు చేసుకోవాలి. సంవత్సరానికి 6 ఋతువులు, రెండేసి నెలలు ఒక ఋతువు అంటారు. అవి శిశిరము, వసంతం, గ్రీష్మం, వర్ష, శరత్, హేమంతం, ఋతువులు.
ఇప్పుడు జనవరి నెల శిశిర రుతువు. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. చర్మం నందు శ్రోతస్సులు సంకోచించి మార్గవరోధం కలుగుతుంది. శరీర ఉష్ణం బయటికి రాక అంతర్గతంగా ఉండి, జఠరాగ్ని వృద్ధి అవుతుంది. ఆకలి ఎక్కువగా అవుతుంది. ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. అధిక బలం కలుగుతుంది. ఈ కాలములో మధుర, ఆమ్ల, లవణం రసములు తీసుకోవాలి. ఉన్ని దుస్తులు దరించాలి.
1. రాత్రి త్వరగా నిధురపోవాలి. నిదురించే ముందు ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం, ఒక పెద్ద గ్లాస్ నీటిలో వేసి నానాపెట్టి ఉంచాలి.
2. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు లేచి శుభ్రంగా చేతులు కడుక్కొని కండ్లను చన్నిటితో కడగాలి. దీని వలన కంటి చూపు పెరుగుతుంది. కింద కానీ కూర్చి మీద కానీ కూర్చొని కాలంను బట్టి 1 లీటర్ గోరువెచ్చని నీటిని తాగితే పొట్ట శుభ్రం అవుతుంది. లేదా త్రిఫల చూర్ణం నీటిలో కలిపి తాగాలి. తరువాత కాలకృత్యములు చేసుకోవాలి.
2. స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చే ప్రాంతంలో పచ్చని గడ్డి మీద లేదా ఇసుకలో వాకింగ్ చేస్తూ చక్కని స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి. ఇలా చేస్తే కాళ్ల పాదాలకు అక్యూప్రెషర్ ఐ రక్తప్రసరణ జరుగుతుంది.
3. కాలాన్ని బట్టి వేడి కానీ చల్లని నీటితో స్నానము చేయాలి. వీలుంటే యోగాసనాలు లేదా ఇతర వ్యాయామము 45 నిముషాలు చేయాలి.
4. ఉదయం టిఫిన్ కంటే ముందు గోరువెచ్చని నీటిలో తేనే నిమ్మరసం కలిపి తాగాలి. టిఫిన్ కి బదులు కాయగూరలు రసాలు, ఏదైనా రాగి, జొన్న జావా, బార్లీ జావా తాగాలి. వీలుంటే మొలకెత్తిన గింజలు తినాలి.
5. మధ్యాహ్నం భోజనంలో చక్కని రెండు గోధుమ రొట్టెలు, ఒక కప్పు అన్నం తిని ఒక గ్లాస్ మజ్జిగలో ఉప్పు కానీ పంచదార కానీ కలిపి తాగాలి. ఎక్కువగా భోజనము చేయరాదు. ఆహారం బాగా నమిలి తినాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. భోజనం చేసి అర గంట ముందు నీరు తాగాలి. భోజనం చేసిన తరువాత 45 నిమిషాలు ఆగి నీరు తాగాలి. బక్కగా ఉన్నవారు, పూర్తిగా ఆహారం మధ్యలో అత్యవసరం అయితే తప్ప నీరు తాగరాదు. లావుగా ఉన్నవారు ఆహారం మధ్యలో కొద్దిగా నీరు తాగాలి.
6. సాయంత్రం అల్పాహారం పండ్లు, పాలు, జ్యూస్, లేదా ఒక లెమన్ టీ, లేదా అల్లం టీ తాగాలి.
7. రాత్రి 8 గంటలకు రెండు చపాతీలు ఆకుకూరలతో తినాలి.
8. ముడు పూటల తిన్న తరువాత వజ్రాసనం 15 నిమిషాలు వేయండి.
9. మద్యం, దూమపానం, కూల్డ్రింక్స్, మసాలా, ఆయిల్ పదార్దాలు, బజారులో దొరికే ఫాలుదా బండిలో ఉన్న ఐస్క్రీమ్, జ్యూస్ తాగరాదు. శనగపిండి, మైదాపిండితో తయారు చేసినవి తినరాదు.
9. చింత పండు తక్కువగా తీసుకోండి. క్షార ఆహారం, అన్ని రకాల పండ్లు తినండి. కాయకూరలు, మొలకెత్తిన విత్తనాలు తినండి. దంపుడు బియ్యం తినండి. కాయకురాలు ఉడికించి తినండి.
10. 15 రోజులకీ ఒకసారి వేడి నీటిలో ఉప్పు వేసి పరిగడుపున తాగి వాంతులు చేయాలి.
11. వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలి. మధ్యమధ్యలో నిమ్మరసం తాగాలి.
12. శీతాకాలంలో ప్రతిరోజు 3 లీటర్ల కంటే ఎక్కువగానే తాగాలి. లేకపోతే మలబద్ధకంవస్తుంది. మూత్రవిసర్జన సరిగ్గా కాదు.
13. శరీరం లోపనుండి వచ్చే వేగాలను అపకూడదు. తుమ్ములు, దగ్గు, పిత్తు, మలం, మూత్రం, వీటిని ఆపితే జబ్బులు వస్తాయి.
14. ఎక్కువగా నీరు తాగితే జీర్ణక్రియ మందగించి ఆహారం సరిగ్గా అరగక అజీర్తి వస్తుంది. పొట్ట నీటితో నిండి ఉండటం వలన ఆకలి వేయదు. గుండె, మూత్రపిండాలు జబ్బులు చేస్తాయి. అతిగా నీరు తాగకూడదు,తక్కువగా కూడా తాగరాడు. దాహం వేసినపుడే తాగాలి.
15. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. positive think తో ఉండాలి. మానసిక ఒత్తిడి కలిగినపుడు కొద్దిగా ధ్యాన ముద్ర వేసి రిలాక్స్ తీసుకోవాలి. ప్రశాంతంగా వుంటూ చిరు నవ్వుతో ఉండాలి.
(తప్పక చదవండి: షేక్.బహర్ అలీ.. ఆరోగ్య చిట్కాలు)
16. తీవ్రమైన దీర్ఘకాలిక జబ్బులు వస్తే ఉపవాసం చేసి జబ్బులను తగ్గించాలి.
17. ఉదయం ఖాళీ కడుపుతో, సాయంత్రం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉంటాం.
18. హిత్బుక్, మిత్బుక్, ఋతుబుక్ కాలాన్ని బట్టి అరుగుదల అయ్యే ఆహారం పరిమితంగా తినాలి.
19. మనం దైనిందన కార్యక్రమాలు చేస్తూ, చెట్లు పెంచటం, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచటం, చేతనైతే పక్క వారికు ఆపదలో ఉంటే ఆదుకోండి. మీగత ఖాళీ సమయంలో సమాజ సేవ చేయండి. మంచి మనసుతో చేసే పని ఎప్పటికి వృధా కాదు.
-షేక్.బహర్ అలీ.
యోగచార్యుడు