షేక్.బహర్ అలీ: విద్యార్థులలో ఏకాగ్రత పెంచటానికి..

చిన్న పిల్లలలు కరోన వైరస్ కారణంగా పాఠశాలలకు వెళ్లకుండా ఇంట్లోనే ఆన్లైన్ ద్వారా విద్యాభ్యాసం నేర్చుకుంటున్నారు. కొంత మంది పిల్లలకు అసలు ఆన్లైన్ తరగతులు లేక వారు ఉన్నారు. వీరు పిల్లలు బయటకి వెళ్లి ఆడుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. దీనితో పిల్లల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. ఇంట్లోనే అన్ని రకాల పనులు చేసుకోవటం, పిల్లలను వైరస్ కారణంగా బయటపడి బయటకు పంపకపోవటం ఇలాంటివి చాలా వాటితో వారు ఏకాగ్రత కోల్పోతారు.
పిల్లలలో ఏకాగ్రత పెరగటానికి కొన్ని విషయాలు ఈ రోజు చెప్పుకుందాం.
ఏకాగ్రత జ్ఞానానికి సంబందించి మనిషికి గల గొప్ప సామర్ధ్యం. ఏకాగ్రత అభ్యసించిన మనిషి తనను తాను ఎన్నో రకాలుగా సంస్కరించుకోగలుగుతాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటాడు. పెద్దలకైనా, పిల్లలకైనా, స్త్రీలకైనా, ఉద్యోగులకైనా, ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత లేకుండా మనిషి తన లక్ష్యాన్ని చేరుకోలేడు. పరీక్షలతోపాటు ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నా అతనికి కష్టమౌతుంది.
ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా, ఇంట్లో పనులు చేయాలన్నా, ఏదైనా ఆటలో ముందుగా బహుమతి తీసుకోవాలన్న చక్కగా చదువుకోవాలన్న, ఏకాగ్రత చాలా అవసరం.ఏదైనా పని మీద దృష్టి పెట్టాలన్న ఏదైనా ఫలితాన్ని పొందలన్న ఏకాగ్రత అవసరం.
ఏకాగ్రత అంటే ఏమిటి. ఏ రకమైన ఆలోచనలు మనసుని తాకకుండా, దూరంగా నెట్టి వేయటం. అలానే అన్ని రకాల మానసిక సామర్ధ్యాలను ఒకే బిందు పైన కేంద్రీకరించటం. క్రమశిక్షణాయుతమైన జీవన శైలి, ప్రశాంత వాతావరణం, నియమిత యోగాభ్యాసం, ఆధ్యాత్మికంగా ఉండటం, ధ్యానం, చేయటం వంటి కారకాలు ఏకాగ్రతని పెంచుతాయి
ఏకాగ్రతకు రావాలంటే కొద్దిగా శరీరానికి వ్యాయామం కూడా చాలా అవసరం, ఏదైనా గేమ్స్ ఆడటం వలన ఇది మానసిక నైపుణ్యము పెంచుతుంది.
ఏకాగ్రతకు దెబ్బ తీసే కొన్ని కారణాలు.
ఈ రోజులలో ప్రతి ఒక్కరి ఇండ్లలోటీవీ లు ఉన్నాయి. అంతే కాకుండా ఆన్లైన్ తరగతులు ఆరంభించిన తరువాత పిల్లలు సెల్ ఫోన్లో క్లాసులు వినటం చూడటం జరుగుతుంది. ఇవి విద్యార్థుల మనసుకి విక్షేపాన్ని కలుగజేస్తాయి. దాని వలన ఏకాగ్రత భంగమౌతుంది.
ఈ విధంగా మానసిక ఏకాగ్రతను క్షిణింపచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పని మీద కూడా దృష్టి పెట్టలేము, పని చేయలేము, పని చేయటం కష్టమవుతుంది.
మనిషి మనసు ఆకర్షణీయమైన చుట్టూనే తిరుగుతుంది.చికాకు,లేవటం, పగటి కలలు కనటం, వ్యతిరేకమైన ఆలోచనలు చేయటం, వీటి వలన ఏకాగ్రత ఉండదు.దీని వలన ఒత్తిడి, ఉదాసీనత, నిద్రలోపం, ఆహారలోపం, ఇంకా ఇప్పుడు అయితే సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వంటి విషయాలతో కూడా ఏకాగ్రత తగ్గుతుంది. ఈ సమస్యను “అవధాన న్యూనత అతి క్రియాశీలత ” (a t h d) అంటారు. ప్రతి 5 గురు పిల్లల్లో ముగ్గురికి ఇలాంటి సమస్య ఉంది. ఈ సమస్యకు గురైన పిల్లలు నిర్లక్ష్యం, అతి చురుకుగా ఉండటం, వీరికి ఉద్రేకం ఎక్కువగా ఉండటం, ఏకాగ్రత లేక ఏదో ఒక పని చేయటం, వీరు ఎవరు ఏమి చెప్పిన సరిగ్గా వినరు. తరచు అధిక ప్రసంగం చేయటం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, తేలికగా విచలితులై పోతారు. తమ పనులు పిల్లలు సకాలంలో చేయలేరు. వీరు కొన్ని రకాల నియమనిబంధనలు పాటించకగలిగితే వీరు చక్కగా ఏకాగ్రతగా పెరుగుతుంది. చక్కగా వుంటారు.
మిగతా భాగము రేపటి ఆర్టికల్‌లో చదవండి..
-షేక్. బహర్ అలీ.
యోగచార్యుడు