సిఇసికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: భారత్లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కరోనా ఎవరినీ వదలడం లేదు. కరోనాకి వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా సోకుతున్నది. ఇప్పటికే అనేక మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటుగా ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ లు ఇద్దరు కరోనా బారిన పడ్డారని సిఇసి ఈరోజు ప్రకటించింది.