సూర్యాపేట స‌ర్కార్ ఆసుప‌త్రిలో వైద్యసేవలు భేష్‌: పిసిసి చీఫ్ ఉత్తమ్

సూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు బాగున్నాయ‌ని పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన హాస్పిటల్‌ను సందర్శించి కొవిడ్ చికిత్స తీసుకుంటున్న రోగుల‌తో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీగా దవాఖానల్లో సౌకర్యాలు కల్పించేందుకు తన సహకారం ఉంటుందని ఉత్తమ్‌  తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అంజద్ అలీ, టీపీసీసీ నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్ త‌దితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.