స్థిరంగా బంగారం.. త‌గ్గిన‌ వెండి ధరలు

హైద‌రాబాద్‌: భార‌త్‌లో ప‌సిడి ప్రియులు ఎక్కువే కాబ‌ట్టి.. ఇక్క‌డ ప‌సిడికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. ఈ మ‌ధ్య కాలంలో ప‌సిడి ప్రియుల‌కు బంగారం దిగి వ‌చ్చిన‌ట్టే క‌నిపించింది. మ‌ళ్లీ నిన్న‌టి వ‌ర‌కు పెరుగుద‌ల చోటుచేసుకుంది. తాజాగా ఆదివారం మాత్రం బంగారం ధ‌ర స్థిరంగా ఉంది. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో పెరుగుద‌ల, త‌గ్గుద‌ల కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

  • హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,090 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 కు చేరింది.
  • వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర రూ. 300మేర తగ్గి రూ. 69,700 వద్ద కొనసాగుతోంది. ఇది వెండి ప్రియుల‌కు శుభ‌వార్త‌.
Leave A Reply

Your email address will not be published.