హ్య‌పీ బ‌ర్త్ డే గూగుల్‌!

హైదరాబాద్‌: ఇప్పుడు గూగుల్ అనే పేరు తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు గూగుల్ సొంతం.. ఎంత‌లా అంటే గూగుల్ లేకుంటే బ‌డి పిల్ల‌ల నుండి బ‌డా పారిశ్రామిక వేత్త‌ల వ‌ర‌కు.. సామాన్యుల నుండి సాఫ్ట్‌వేర్ వ‌ర‌కు. చిన్న ప‌రిశ్ర‌మ మొద‌లు భారీ ప‌రిశ్ర‌మ‌ల వ‌ర‌కు ఎవ‌రైనా.. ఎదైనా… ఎప్ప‌డైనా.. ఎక్క‌డైనా.. గూగుల్ వాడ‌ని వారుండ‌రు. అంద‌రికీ ఇప్పుడు గూగుల్ నిత్యావ‌స‌ర‌మే.. అంత‌లా మ‌నుషుల జీవితాల్లో పెన‌వేసుకుపోయింది గూగుల్‌.. ఇప్పుడెందుకు ఇదంతా అంటే.. ఇవాళ గూగుల్ బ‌ర్త‌డే.. అందుకే ఈ ఉపోద్ఘాత‌మంతా.. నిజానికి సెప్టెంబర్ 7నే గూగుల్ ప్రారంభమైంది. అయితే, కంపెనీకి కార్పొరేట్ కంపెనీగా గుర్తింపు లభించింది మాత్రం సెప్టెంబర్ 27న. నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈరోజు మ‌న‌కు ఏ విష‌యం గురించి వివ‌రాలు కావాల‌న్నా.. ఆధారపడుతాం. సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ఉండీ ఇంటర్నెట్‌ వాడుతున్న ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని పేరిది. అసలు ఇంటర్నెట్‌ అంటేనే గూగుల్‌ అన్నంతగా ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. అలాంటి ఈ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నది. తన 22వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తనకోసమే ప్రత్యేక డూడుల్‌తో నెటిజ‌న్ల ముందుకొచ్చింది.

 

పుట్టుకః లారీ పేజ్ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆయ‌న‌ సెర్జీ బ్రిన్ 1998 సెప్టెంబర్ 27న గూగుల్‌ను స్థాపించారు. కాగా సెర్చ్ ఇంజిన్‌కు పేరు గూగోల్‌ అనే పదం గూగుల్ అని వచ్చింది. అంటే 1 పక్కన 100 సున్నాలు పెడితే ఆ సంఖ్యను గూగోల్ అంటారు.

Leave A Reply

Your email address will not be published.