అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: కేటీఆర్
హైదరాబాద్: భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహరావు, ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఆ ఇద్దరు నేతలపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఒకరు ప్రధానిగా, మరొకరు సిఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని పేర్కొన్నారు. అటువంటి మహా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు చోటులేదని చెప్పారు.
దీనికి సంబంధించి ఆయన తన ట్విట్టర్ ఖాతాలో కొంచెం సేపటి క్రితం స్పందించారు.
“మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు… వాటిని కూడా కూల్చేయాలి!
మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. 1/2
— KTR (@KTRTRS) November 25, 2020