అత్యవసరం అయితేనే బయటకి రండి: మంత్రి ఈటల

హైదరాబాద్ (clic2news): దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పైకి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే కరోనా తీవ్రంగా అధికంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఎవరైనా కానీ అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. ప్రతీ చిన్న విషయానికి బయటకు రావొద్దని కోరారు. కానీ, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి ఎవరూ భయాందోళనకు గురికావొద్దని మంత్రి సూచించారు.