అఫీషియల్: పవన్-రానా అదిరే కాంబినేషన్

హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయకుడు పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో జోరు పెంచారు. దాదాపు మూడేల్ల తర్వాత `వకీల్‌సాబ్`తో రీ ఎంట్రీ ఇస్తున్న ఆయన.. క్రిష్.. హరీష్ శంకర్‌తో పాటు సాగర్ కె. చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారనున్నారు. ఈ నేపత్యంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్రబృందం సోమవారం అభిమానులతో పంచుకుంది.
`అయ్యప్పనుమ్ కోశియుమ్` రీమేక్ తెరకెక్కుతున్న ఈ ఈచిత్రంలో మరోకీలక పాత్రకు యువ నటుడు రానాను చిత్ర బృందం ఎపిక చేసింది. ఈ పాత్రకోసం ఇప్పటికే సుదీప్, విజయ్‌సేతుపతి, రానా పేర్లు వినిపించగా.. చివరకు ఆ అవకాశం రానాను వరించింది. ఈ మేరకు రానాకు ఆహ్వానం పలుకుతూ చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను పంచుకుంది.
`ఓ అద్భుతమైన ప్రయాణం నేటి నుంచి ప్రారంభం! పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గారితో మేము తెరకెక్కించబోయే చిత్రంలోకి మన భళ్లాలదేవుడు రానాకు స్వాగతం పలుకుతున్నాం` అని చిత్ర బృందం పేర్కొంది.
దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రానా షూటింగ్‌లో పాల్గొనేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని ట్వీట్ చేశారు. జనవరి మొదటి వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటించనున్నాడు. ఆయన సరసన నివేధా కథానాయికగా నటించే అవకాశం ఉంది.. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట.