ఆక్సిజ‌న్ లీకై స‌ర‌ఫ‌రా నిలిచి 22 మంది మృతి

మ‌హారాష్ట్రలో ఘోర ప్ర‌మాదం

నాసిక్ (clic2news): మ‌హారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆసుప‌త్రి బ‌య‌ట ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్ అవ‌డంతో.. రోగుల‌కు ప్రాణ‌వాయువు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో 22 మంది క‌రోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ మున్సిప‌ల్ ఆపుప‌త్రిలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ నుంచి సిలిండ‌ర్ల‌లో ఆక్సిజ‌న్ నింపుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌నా స్థ‌లం వ‌ద్ద ఉన్న అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. లీక‌వుతున్న ఆక్సిజ‌న్‌ను అదుపు చేసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో క్రిటిక‌ల్ పేషెంట్ల‌కు ఆక్సిజ‌న్ అవ‌స‌రం వ‌స్తున్న‌ది.

లీకేజీ ఘ‌ట‌న‌తో సుమారు 30 నిమిషాల పాటు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. బాధితులంతా వెంటిలేట‌ర్ల‌పై ఆధార‌ప‌డి ఉన్నారు. వాళ్ల‌కు నిరంత‌రం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంటుంది. సుమారు 150 మంది రోగులు ఆక్సిజ‌న్‌పై ఆధార‌ప‌డి ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై శీఘ్ర స్థాయిలో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు మంత్రి రాజేశ్ తోప్ తెలిపారు.

ట్యాంక‌ర్ లీక‌వ‌డంతో గ్యాస్ ఒక్క‌సారిగా బ‌య‌టికొచ్చి క‌మ్మేసింది. దీంతో అగ్నిమాక సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేర‌కుని ఆక్సిజ‌న్ లీక్‌ను నియంత్రించారు. ‌

 

Leave A Reply

Your email address will not be published.