ఆర్ఆర్ఆర్: సంబరాల్లో భీం, సీతారామరాజు!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా నటిస్తోంది. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్ ను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో కొమురం భీం, సీతారామరాజు సంబరాల్లో పాల్గొంటున్నట్టుగా అన్పిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2021 అక్టోబర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Wishing everyone a prosperous year ahead.. 💛💛💥 #ఉగాది#ಯುಗಾದಿ #GudiPadwa #नवसंवत्सर #தமிழ்ப்புத்தாண்டு #വിഷു #ਵੈਸਾਖੀ #RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @PenMovies @LycaProductions pic.twitter.com/oHSlYWozNR
— RRR Movie (@RRRMovie) April 13, 2021