ఇండియాలో కొత్తగా 29,163 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. తాజా ప్రకటించిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 29,163 కొత్త కేసులు నమోదుకాగా, 449 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం ఇప్పటి వరకు 88,74,290 కరోనా కేసులు నమోదుకాగా, 1,30,519 కరోనా మరణాలు సంభవించాయి. 82,90,370 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,53,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 40,791 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో 93.42 శాతం “కరోనా” రోగుల రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదైన కొత్త కేసులలో “యాక్టివ్” కేసులు 5.11 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదైన కేసులలో మరణాల రేటు 1.47 శాతానికి తగ్గింది.