ఎం.ఎస్ .రెడ్డి (మల్లెమాల)

మల్లెమాల తెలుగు రచయిత, సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి “సహజ కవి”గా ప్రశంసలందుకున్నారు. ఆయ‌న నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకా’అలిమిలి’ అనేమారుమూల గ్రామంలో 1924ఆ గస్టు 15న రంగమ్మ, రామస్వామిరెడ్డిగార్లకు మల్లెమాల సుందరరామిరెడ్డి జన్మించారు. పెద్దగాచదవకపోయినా మాతృభాషపైపట్టు సాధించారు. పలురకాల చిరువ్యాపారాలు చేసారు. ఎందరోబలిఅయిన బెంగాల్కరువుపై సుంకరసత్యనారాయణ, వాసిరెడ్డిభాస్కరరావుగార్లు రాసినబుర్రకథ తను ప్రదర్మిస్తూ తద్వారా పదివేలరూపాయలు సేకరించి కలకత్తా పంపారు.

అనంతరం నెల్లూరు ‘జమీన్రైతు’ పత్రికలో ‘మాకొద్దు జమిందారిపెత్తనం’ అనేగేయాన్ని రాసి, ప్రకాశంపంతులుగారిచే ‘సహజకవి’ అని పిలవబడ్డారు. 1963 డిసెంబరులో ‘సుందర్మహల్ ‘అనేసినీధియోటర్‌ను ప్రారంభించారు. 1964 తొలిసారి చిత్రసీమలో అడుగిడుతూ తమిళచిత్రం ‘కుమరిప్పెణ్ ‘చిత్రాన్ని తెలుగులోస‌ కన్నెపిల్లస‌ పేరున డబ్చేసి విడుదల చేస్తే వందరోజులు ఆడింది. అనంతరంస‌ కొంటెపిల్లస‌ (1967)స‌ కాలచక్రంస‌ అనే డబ్బింగ్ చిత్రాలు విడుదల చేసి. 1968లో ‘భార్యస‌ చిత్రం నిర్మించారు. సౌత్ఇండియ ఫిల్మ్ అసోసియేష‌న్ కార్య‌వ‌ర్గ సభ్యులుగా, దక్షణ భారత చలన చిత్ర రచయితల సంఘ అధ్యక్షులుగా, తెలుగు నిర్మాత మండలి అధ్యక్షులుగా, ఫిలింనగర్ కో ఆప‌రేటివ్ హ‌సింగ్ సొసైటీ అధ్యక్షులుగా, ఫిలిండవలప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా తనవంతు సేవలు చిత్రపరిశ్రమకు అందించారు. ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో హైరాబాద్ లో ‘శబ్దాలయ’పేరున రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ వంటిసౌకర్యాలు అందులో ఏర్పరిచారు. సాహిత్యరంగంలో ‘మల్లెమాల రామాయణం”వృషభపురాణం’ ‘నిత్యసత్యాలు’ ‘తేనెటీగలు’ ‘మంచుముత్యాలు’ ‘అక్షరశిల్పాలు’ ‘ఎందరోమహానుభావులు’ ‘వాడనిమల్లెలు వంటిపద్య, గద్యపుస్తకాలు వెలువరించారు.

199 లో ‘అంకుశం‌ చిత్రంలో నటుడుగా మారారు. సినీ నిర్మాణంలో ‘కలసిన మనసులుస‌ (1969)  ‘శ్రీకృష్ణవిజయం’ (1971) ‘ఊరికిఉపకారి'(1973) ‘శ్రీకృష్ణదేవరాయ’ (కన్నడడబ్బింగ్ 1973) ‘కోడెనాగు (1974) ‘రామయ్యతండ్రి’ (1974) ‘ ‘పుట్టింటిగౌరవం’  ‘దొరలు-దొంగలు’ (1976)’ముత్యాలపల్లకి'(1977) ‘నాయుడుబావ'(1978) ‘రామబాణం'(1979) ‘తాతయ్యప్రేమలీలలు’ (1980)’ఏకలవ్య'(1982) ‘కల్యాణవీణ’ (1983) ‘పల్నాటిసింహం’ (1985) ‘లేడిడాక్టర్ ‘(1985కన్నడడబ్బింగ్ ) ‘ఓప్రేమకథ'(1987) ‘రామాయణం'(1997) ‘వంశోధ్ధారకుడు’ (2000)’అందం’ ‘సమర్పకుడుగా కుమారుడు శ్యాంప్రసాదరెడ్డి చిత్రాలు’ తలంబ్రాలు’ ‘ఆహుతి’ ‘అకుశం’ ‘ఆగ్రహం’ ‘అమ్మోరు` వ్యవహరించారు.

పాటలరచయితగా భార్య చిత్రంలో ‘చీటికిమాటికి చిటపటలాడిన కోడెనాగుచిత్రంలో ‘ఇదేచంద్రగిరి-సంగమం”రామయ్యతండ్రి చిత్రంలో ‘మల్లెవిరిసింది పరిమళపు జల్లుకురిసింది’-వెన్నెలరోజు `ముత్యాలపల్లకిచిత్రంలో ‘సన్నాజాజికిగున్నామామికిపెళ్ళికుదిరింది’-తెల్లవారకముందేపల్లేలేచింది ‘దొరలుదొంగలు చిత్రంలో ‘చెప్పాలనుకున్నా’-ఏనాడో అనుకున్నది’ కల్యాణవీణ ‘వేగుచుక్క మెలచింది’ అంకుశం` ఇదిచెదరనిప్రేమకు శ్రీకారం’రామబాణం’చిత్రంలో అమ్మప్రేమకు మారుపేరు’ పుట్టింటి గౌరవంచిత్రంలో అమ్మలేనిపుట్టిల్లు నాయుడుబావచిత్రంలో’నెల్లారుచేలలో పిల్లగాలికి’ ఏకలవ్యచిత్రంలో ‘ఇదిమల్లేలు విరిసిన ఉదయం’-మోగింది ఢమరుకం’ తలంబ్రాలుచిత్రంలో `ఇదిపాటకానేకాదు’ వంటిఎన్నో రసరమ్యగీతాలు వీరికలంనుండి జాలువారాయి. కవిగా, నటుడిగా, నిర్మాతగా, పాటల రచయితగా, బహుముఖప్రజ్ఞాశాలి అయిన వీరు రఘపతివెంకయ్యగారి అవార్డు అందుకున్నారు. అలుపుఎరుగని ఈ తెలుగుకీర్తి శిఖరం 2011 డిసెంబర్ 11 న బ్రహ్మలోకం పయనించారు.

-డా.బెల్లంకొండనాగేశ్వరరావు

Leave A Reply

Your email address will not be published.