ఎపిలో కొత్త‌గా 3,495 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు మ‌ళ్లీ మూడు వేలు దాటాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 3,495 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 925401 కు చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,053 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా డిశ్చార్జిల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం 897147 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 20954 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7300 మంది మృతి చెందార‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.