ఎపిలో కొత్త‌గా 585 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,066 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్త‌గా 585 పాజిటివ్‌ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనాతో 7197 మంది మృతిచెందారు. తాజాగా 251 మంది రికవరీ అయ్యారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య 895121కి చేరింది. అలాగే కోలుకున్నవారి సంఖ్య 884978 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2946 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌ లో పేర్కొంది

Leave A Reply

Your email address will not be published.