ఎపిలో కొత్తగా 74 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 25,907 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు కరోనాతో 7,176 మంది మృతిచెందారు. తాజాగా 61 మంది రికవరీ అయ్యారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,766కు చేరింది. అలాగే కోలుకున్నవారి సంఖ్య 8,82,581కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1009 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.