`ఎబిఎన్-ఆంధ్రజ్యోతి` రాధాకృష్ణ ఇంట విషాదం

హైదరాబాద్ (CLiC2NEWS): ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ(63) ఇవాళ కన్నుమూశారు. గుండె పోటు రావడంతో అపోలో లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వేమూరి కనకదుర్గ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కల్యాణ్ సంతాపం తెలిపారు.