ఎమ్మెల్సీ పోరు: 9 గుర్తింపు కార్డులకు అనుమతి

హైదరాబాద్: రంగారెడ్డి – హైదరాబాద్-మహబూబ్‌నగర్, ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నారు. ఈ నెల 14వ జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా తొమ్మిది రకాల గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటువేసే అవకాశముంటుంది.
గుర్తింపు కార్డులు
- ఆధార్‌కార్డు
- పాస్‌పోర్టు
- డ్రైవింగ్ లైసెన్స్
- ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్
- పాన్‌కార్డు
- ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం
- ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు,
- యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్లు,
- దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులో ఏదైన ఒకటి తప్పనిసరిగా ఉండాలి.