ఎల్లుండి ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి ప్రమాణం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీదేవి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 26న ఉదయం 08.30 గంటలకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగనుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి.. నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా రెండోసారి గెలవగా వాణీదేవి మొదటిసారి గెలిచారు.