ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ఆఫీసుకెళ్లిన బెంగాల్ సిఎం

కోల్‌క‌తా: దేశంలో పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా గురువారం ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ప్ర‌యాణించారు. కోల్‌క‌తాలో ఆమె ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌పై పిలియ‌న్ రైడ్ చేస్తూ ఆఫీసుకు వెళ్లారు. ఈ దృశ్యాల‌ను స్థానిక ఛాన‌ళ్లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశాయి. మ‌రోవైపు ఈరోజు బెంగాల్‌లో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.91కి అమ్ముతున్నారు. ముంబైలో రూ.97కు అమ్ముతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎల్‌పీజీ, డీజిల్ ధ‌ర‌ల‌ను రోజూ పెంచుతోంద‌ని, ఇది ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు మ‌మ‌తా ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.