ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో కొత్తగా 1732 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14 మంది మృత్యువాత పడినట్లు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,47,977కు చేరింది. కొత్తగా 14మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6828కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,761మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 88,63,340మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 70,405 నమూనాలు పరీక్షించినట్లు పేర్కొన్నారు.