ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 490 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,79,718 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,68,769 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,864 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,085 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,716 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,14,15,246 నమూనాలను పరీక్షించినట్లు సర్కార్ బులిటెన్లో పేర్కొంది.