ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
తూర్పుగోదావరి: రాజమండ్రి రామాలయం వీధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లీ, కూతురు ఉరివేసుకుని చనిపోయారు. మృతులను సంగిశెట్టి కృష్ణవేణి (55), భూపతి శివపావని (27), నిషాన్ (9), రితిక (7)లుగా గుర్తించారు. కుటుంబకలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. శివ పావని భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో వీరంతా ఆత్మహత్యకు కారణంగా తెలిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు.