Corona: కుటుంబంలో నలుగురు మృతి

మహబూబాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా కాటుకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లుకుదురులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కరోనాతో మరణించారు. 11 రోజుల వ్యవధిలోనే ఇద్దరు భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల మే 2వ తేదీన తండ్రి, 4వ తేదీన పెద్దకుమారుడు మృతిచెందగా.. 11వ తేదీన చిన్నకుమారుడు మరణించారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి (60)కూడా మరణించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ చనిపోవడంతో నెల్లికుదులో తీవ్ర విషాదం నెలకొన్నది.