ఒకే పాఠశాలలో 229 మంది విద్యార్థులకు కరోనా

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది కొనసాగుతోంది. వషిమ్ జిల్లాలోని ఓ పాఠశాల వసతిగృహంలో ఏకంగా 229 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో పాఠశాల పరిసరాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వీరిలో అమరావతి, యవత్మల్ జిల్లాలకు చెందిన విద్యార్తులే ఉండటం గమనార్హం.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 8,807 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,21,119కు, మరణాల సంఖ్య 51,937కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో 2,772 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.