కడప జిల్లాలో విషాదం.. జిలెటిన్ స్టిక్స్ పేలి 9 మంది మృతి

కలసపాడు (CLiC2NEWS): కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లె శివారులో జిలెటిన్‌స్టిక్స్ పేలడంతో 9 మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. బద్వేలు నుంచి ముగ్గురాల్ల గనికి జిలెటిన్‌స్టిక్స్ వాహనంలో తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.