కరోనాతో ప్రముఖ పంజాబీ గాయకుడు కన్నుమూత

చండీఘర్‌ : పంజాబీ ప్రముఖ గాయకుడు శార్దుల్‌ సికందర్ (60) కన్నుమూశారు. ఇటీవల శార్దుల్‌ కరోనా వైరస్‌ బారిన పడి మొహాలీలోని ఫోర్టిస్‌ ఆసుపత్రిలో చేరారు. కరోనాతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స పొందుతున్న​ శార్దుల్ తుదిశ్వాస విడిచారు. ఈయన మరణాన్ని పంజాబ్ సిఎం అమరీందర్‌ సింగ్‌ ట్విటర్‌లో తెలిపారు.

‘సను ఇష్క్‌ బరందీ చాద్‌ గయి, ఏక్‌ చక్ర గలి దే విచ్‌ ‘ వంటి పాప్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయ్యారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌, శిరోమణి అకాలీ దళ్‌ నేత సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌, సంగీత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సింగర్స్‌ గుర్‌దాస్‌ మన్‌, దలేర్‌ మెహందీ, కమెడియన్‌ కపిల్‌ శర్మ, హర్దీప్‌ కౌర్‌, కంపోజర్‌ విశాల్‌ దడ్లానీ నివాళులర్పించారు. శార్థూల్‌ 80వ దశకంలో తన కెరీర్‌ను స్టార్‌ చేశారు. పటియాలా ఘరానాకు చెందిన ఆయన… 30 సంవత్సరాల్లో 25 ఆల్బమ్స్‌ను రూపొందించారు. ఆయన పలు పంజాబీ చిత్రాలకు కూడా పనిచేశారు.

కాగా శార్దూల్ సికిందర్‌ పంజాబీ ఫోక్ సింగర్‌, పాప్ సింగ‌ర్‌. 1980లో ఆయ‌న రోడ్‌వేస్ ది లారీ పేరిట‌ మొద‌టి ఆల్బ‌మ్‌ను విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత శార్దూల్‌కు మంచి పాపులారిటీ వ‌చ్చింది. మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయ‌న న‌ట‌న‌కు మంచి గుర్తింపు కూడా వ‌చ్చింది. జ‌గ్గా ద‌కురా మూవీలో శార్దూల్ న‌ట‌న ఎంద‌రినో మెప్పించింది.

 

Leave A Reply

Your email address will not be published.