కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సమదోషాః. సమాగ్నిశ్చ సమాధాతుమలక్రియః.
ప్రసన్నాత్మేంద్రియమనః స్వస్థ్ ఇత్యభిధీయతే.
ఎవరికి మూడు దోషములు అనగా వాతం,పిత్తం,కఫం,సరిగా నుండునో ,జఠరాగ్ని సమముగా నుండునో ,శరీరం ధరణంమోనర్చునట్టి సప్తధాతువులు అనగా, రసం,రక్తం, మాంసం, మేధా, ఆస్థి, మజ్జ, వీర్య, తగిన నిష్పత్తిలో మలమూత్రములు చక్కని రీతిలో జరుగుచుండునో, దశేంద్రీయలు కన్నులు, చెవులు, ముక్కులు, త్వచ, నాలుక, గుద, మూత్రనాలం, మనసు, మరియు విని స్వామియగు ఆత్మయును ప్రసన్నముగా వుండునో, అట్టి వ్యక్తిని ఆరోగ్యవంతుడు అని అంటారు. ఋషులు ఆరోగ్యవంతంగా శరీరమును గురించే చక్కగా చెప్పినారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1. ఉదయం లేవగానే కూర్చొని రెండు గ్లాసుల మంచి నీరు తాగాలి.
2. తరువాత ఒక లీటర్ గోరువెచ్చని నీటిలో బీపీ ఉంటే ఉప్పు వేయరాదు. బీపీ లేకపోతే చిటికెడు ఉప్పు వేయాలి. షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఉంటే ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. తరువాత దానిని వాంతులు చేసుకోవాలి. ఇది శంఖ ప్రక్షాళన అంటారు.. 21 రోజుకి ఒక్కసారి చేస్తే చాలు గొంతు మొత్తం శుభ్రం అవుతుంది. మలమూత్ర విసర్జన చక్కగా జరుగుతుంది.
3. physical exercise యోగ, డాన్స్, స్కీప్పింగ్, స్విమ్మింగ్, ఏదైనా ఆటలు కానీ వాకింగ్,జాగింగ్,ప్రాణాయామం 45 నిమిషాలు చేయాలి.
4. వ్యాయామం చేసిన 20 నిమిషాలు తరువాత స్నానం చేయాలి.
5. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ నిమ్మరసం , ఒక టీ స్పూన్ తేనే కలిపి తాగాలి.నిమ్మరసం వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది.నిమ్మ పండులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.ఇది శరీరానికి చాలా అవసరం ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎడ్రినల్ గ్రంధులు సరిగ్గా తమ విధులు నిర్వహించేటట్లు చేస్తుంది.గాయాలు తగ్గిస్తుంది.తాజా నిమ్మరసంలో మాలిక్ యాసిడ్,సిట్రిక్ యాసిడ్,పాస్పోరిక్ యాసిడ్,నాన్ రేడ్యూ సెండ్ సుగర్స్ ఉంటాయి.
నిమ్మరసం సేవించటం వలన రక్తం శుద్ధి అవుతుంది. నిమ్మరసం తీసుకోవటం వలన uric ఆసిడ్ న్యూట్రలైజ్ అవుతుంది.
నిమ్మరసం నందు ఉన్న uric ఆసిడ్ నేచురల్ యాంటీ సెప్టిక్ లాగా పనిచేసి కడుపులో ఉన్న క్రిములను సంహరిస్తుంది.
తేనే అన్ని రోగాలకు మంచి ఔషదంలాగా పనిచేస్తుంది. ప్రేవులకు శక్తినిస్తుంది. బలాన్నిస్తుంది. విషక్రిములను సంహరిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం తగ్గిస్తుంది. శారీరక, మానసిక, అలసటను తగ్గుస్తుంది.
6. ఉదయం ఏదైనా అల్పాహారం తీసుకోవాలి.
7. ఒక టీ స్పూన్ చవన్ ప్రాష్ తినండి. అర గంట తరువాత అల్లం టీ కానీ, మిరియాల టీ కానీ,వేడి పాలు ఒక గ్లాస్ తాగాలి.
8. ఉదయం 11 గంటలకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ లో ఒక చిటికెడు మిరియాల చూర్ణం.టీ స్పూన్ తేనే కలిపి తాగండి. వారానికి 3 సార్లు మాత్రమే మిరియాలు చూర్ణం వేయాలి. మిగతా టైంలో జ్యూస్ లో తేనే నిమ్మరసం కలిపి తాగాలి. బెస్ట్ ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనుచేస్తుంది.
9. మధ్యాహ్నం భోజనం తరువాత పలుచటి మజ్జిగలో చిటికెడు ఉప్పు,చిటికెడు మిరియాల చూర్ణం కలిపి తాగండి.మిరియాల చూర్ణం రోజుకు ఒకసారి మాత్రమే వాడాలి.
10. సాయంత్రం స్ట్రాంగ్ టీ ,కానీ గ్రీన్ టీ కానీ తాగండి.
11. సాయంత్రం 6 గంటలకు యోగ,నమాజ్ ఆధ్యాత్మిక వ్యాయామం కానీ physical ఫిట్నెస్ కోసం వాకింగ్,ప్రాణాయామం 30 నిమిషాలు చేయండి
12. రాత్రి చక్కని భోజనం చేసి 5 నిమిషాలు వాకింగ్ చేసి వజ్రాసనం లో 10 నిమిషాలు కూర్చోండి.బండలు కూడా కరుగుతాయి. జబ్బులు త్వరగా రావు.
ఆహారం, చక్కని నిద్ర, చక్కని సంసారం బ్యాక్ట్రియను, వైరస్ ని, ఫంగస్ ని దెబ్బకు చంపుతుంది. త్రయోపస్థంభ ఆహారనిద్ర బ్రహ్మ చర్యమితి అని చరక మహర్షి చెప్పినారు.
13. తాటి బెల్లం, తేనె కూడా తీసుకోవాలి.
14. నీరు వేడి చేసి చల్లార్చి వడపోసి తాగండి.
ఇమ్మ్యూనిటి పెంచుకోవడానికి ఆహారపదార్థాలు
చరక మహర్షి తన శిష్యుడు ని వాగ్భట్టు ఆరోగ్యవంతుడు ఎవరు అని అడిగితే ఇలా సమాధానం చెప్పినారు. హిత్ భూక్, మిత్ భూక్, రూత్ భూక్,అనగా హితము చేయునది, తగినంత ఋతువులు ననుసరించి భోజనం చేసేవాడు అని సమాధానం చెప్పినారు.
ఇమ్మ్యూనిటి, వ్యాధినిరోధకశక్తి,రోగనిరోధక శక్తి, పెంచుకువటానికి తినవసలసిన ఆహారపదార్దాలు. బియ్యం, గోధుమలు, సోయాబీన్స్, బార్లీ, రాగులు, A B, C, D, విటమిన్ ఉన్న నువ్వు లుండలు, ప్రొద్దు తిరుగుడు గింజలు, పల్లి లుండలు, పాలు, గుడ్లు, చికెన్, మటన్, ఫిష్, వెన్న, నెయ్యి, పెరుగు, మజ్జిగ, ఉసిరి, నిమ్మ జాతి పండ్లు, బత్తాయి, కమల, నారింజ, కివి, ద్రాక్ష, పండ్ల రసాలు తీసుకోవాలి.
డ్రై fruits బాదం, ఆక్రోట్, అంజీరా, కిస్మిస్, ఎండు ఖార్జుర, అలుబకార, బొప్పాయి, జామ, తినాలి. ముల్లంగి, మునక్కాయ మల్టీ విటమిన్ గా పనిచేస్తుంది. దీని ఆకులు కూర లేదా పప్పులో వేసుకొని తింటే సర్వగోగనివారణ గా పనిచేస్తుంది. క్యారెట్, పాలీజ్కురా, తోటకూర, మెంతికూర, మామిడి పండ్లు, సీతాఫలం, దంపుడు బియ్యం, ఉల్లిపాయ, ఎల్లుల్లి, పట్టా చెక్క, లవంగాలు, ఇలాయిచి, తాలింపు గింజలు, పుదీనా, కొత్తిమీర, ఇలాంటివి ఆహారం తీసుకోవాలి.
తినకూడనివి..
నూడిల్స్, స్నాక్స్, ఆలూచీప్స్, పిజ్జా, బర్గర్, శనగ పిండి, మైదా పిండితో చేసిన పదార్థాలు తినరాదు. ice క్రీమ్, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్.. ఇవి అసలు వీటికి దూరంగా ఉండాలి. గప్ చుప్, ఫ్రైడ్ రైస్, మ్యాగీ, ఇవి తింటే వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. ఇంట్లో తయారుచేసిన పదార్థాలు తినవచ్చును.
శుభ్రత..
- పరిశుభ్రమైన బట్టలు తొడగండి.
- ఇళ్ళు వాకిళ్ళు శుభ్రంగా ఉంచండి.
- చుట్టూ పక్కల మరుగు కాల్వలు ఉంటే bleaching పౌడర్ చల్లండి.
- ఇంట్లో సాంబ్రాణి దూపం ప్రతిరోజు వేయండి
స్పెషల్ చిట్కా..
“ప్రాంత కాలమున జలమును తాగిన వాడికి, మధ్యాహ్నం భోజనం తరువాత మజ్జిగ తాగినవాడికి, రాత్రి నిద్రించి ముందు దుగ్ధ అంటే క్షిరా పానమోనర్చువారికి వైద్యుల అవసరం ఉండకపోవచ్చును.“
హెచ్చరికలు: వ్యాయామం నిదానంగా ఆరంభింస్తు వేగం పెంచుకోవాలి.
గర్భవతులు… పాలిచ్చే తల్లులు, నెలసరి స్త్రీలు, షుగర్ రోగులు యోగా గురువు గారి సమక్షంలో నేర్చుకొని చేయాలి.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు, సెల్: 7396127557