కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అరెస్ట్

హైదరాబాద్ : నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ.. వరంగల్‌లో నేడు రైతన్నలు చేపడుతోన్న ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు (విహెచ్) ను పోలీసులు అరెస్టు చేశారు. పెంబర్తి వద్ద వి.హనుమంతరావును అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుండి వాహనంలో లింగాల ఘనవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై విహెచ్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయల చట్టాల పై దేశ వ్యాప్తంగా రైతన్నల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.