కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు డిగ్రీ, జూనియర్ లెక్చరర్లను క్రమబద్ధీకరించవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి విచారణ జరిపారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రబద్ధీకరిస్తారంటూ ఊహించుకొని పిటిషన్ ఎలా దాఖలు చేస్తారు? అని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సర్కారు కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరించిందా? అని పిటిషనర్లను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ సందర్భంగా పిటిషనర్లపై సీజే హిమాకోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించకుండా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని 2016లో 24 మంది నిరుద్యోగులు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.