కామారెడ్డి డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుమలగిరిలోని ఆయన నివాసంలో నిన్న సోదాలు నిర్వహించిన అధికారులు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో లక్ష్మీనారాయణకు క్లీన్‌చిట్ వచ్చినప్పటికీ.. అక్రమ ఆస్తుల కోణంలో నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ ఇంటితోపాటు ఆయనకు సంబంధించిన అన్ని అపార్ట్‌మెంట్లలో ఏకకాలంలో సోదా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఆయన్ను విచారించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.